![]() |
![]() |

డాక్టర్ శృతి నండూరి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో తన వాయిస్ తో అందరినీ మెస్మోరైజ్ చేస్తోంది. ఇక ఈ వారం "అంతఃపురం" మూవీ నుంచి "అస్సలేం గుర్తుకురాదు" అనే సాంగ్ పాడింది. జడ్జి కార్తిక్ కి ఆమె పెర్ఫార్మెన్స్ పిచ్చగా నచ్చేసింది. దాంతో ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. "ఈ పాటలో గమకాలు పాడడం చాలా కష్టం..కానీ నువ్వు చాలా సునాయాసంగా పాడేసావ్ . ఈ పాట పాడి ఇళయరాజా గారు గర్వంగా ఫీలయ్యేలా చేసావ్" అన్నాడు తమన్. "శృతిని నేను అమెరికాలో రెండు సార్లు కలిసాను..అప్పుడు రెండు సాంగ్స్ పాడి వినిపించారు.
చాలా టాలెంటెడ్..మీ అమ్మ ఎలా ఉన్నారు...నువ్వు నీ ఫ్యామిలీని మిస్ అవుతున్నావ్ అని తెలిసి నేను నీ కోసం స్పెషల్ గా ఒకటి తీసుకొచ్చాను అంటూ బాగ్ లోంచి బాక్స్ తీసి స్వీట్ పొంగల్ తినిపించారు"..తర్వాత ఆ బాక్స్ తీసుకుని తమన్, కార్తిక్ కలిసి తినేశారు. ఇక శృతి పెర్ఫార్మెన్స్ కి ప్యానెల్ మొత్తం బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పారు. అలాగే శృతి సెమీఫైనల్స్ లోకి వెళ్తోంది అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు చిత్ర గారు.ఆ మాటకు శృతి హ్యాపీగా ఫీలయ్యింది. "మీరు నా మ్యూజిక్ మామ్ అనొచ్చు అందుకే నేను మిమ్మల్ని చిత్రమ్మా అని పిలుస్తాను...మీరు ఇచ్చిన టిప్స్, చెప్పిన స్వీట్ వర్డ్స్ అన్నీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను..మీతో ఈ మెమొరీని మా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను" అని చెప్పింది శృతి.
![]() |
![]() |